1.గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 525 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది.
2 తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. తాజాగా 3603 కేసులు నమోదు కాగా రికవరీ అయినవారు 2707 మంది. ఒక మరణం నమోదయింది. ఇప్పటివరకూ మొత్తం మరణాలు 4072.గా వుంది. రికవరీ రేటు 95.08శాతంగా వుంది. 93,397 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
3.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,80, 634 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 542 కి చేరింది.
4 విశాఖలో కరోనా జోరు ఆగడంలేదు. వరుసగా నాల్గో రోజు 2 వేల కేసులకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,258 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒకరు మృతి.. యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 15,695గా వుంది.