Bomb Threat: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిని పేల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆగంతకుడు మెయిల్ పంపాడు. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి ఈ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాసుకి ఖాన్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. వెంటనే వీఐపీలను ప్రముఖులను అందులో నుంచి ఖాళీ చేయించాలని బెదిరింపులు రావడంతో గవర్నర్ కార్యాలయం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిల్ పై దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: PM Modi: నిబంధనలు పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదు.. ఇండిగో సంక్షోభంపై మోడీ సీరియస్
మరోవైపు.. శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టుకు అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అమెరికా వెళ్ళే విమానాల్లో బాంబు ఉందని మెయిల్ పంపాడు.. విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తా అంటూ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. బాంబు పేలకూడదు అంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన ఎయిర్పోర్టు అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.