భారత దేశ కంపెనీ ‘ తాజ్ ’ మరో ఘనత సాధించింది. 2022కు గానూ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హెటల్ బ్రాండ్ గా తొలిస్థానంలో నిలిచింది. బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ “బ్రాండ్ ఫైనాన్స్” యొక్క తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ హెటల్ బ్రాండ్స్ లో తాజ్ హెటల్ బ్రాండ్ టాప్ లో నిలిచింది. తాజా నివేదిక ప్రకారం టోటల్ బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ లో 100 పాయింట్లకు గానూ 88.9 రేటింగ్ సాధించింది. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, ఉద్యోగుల సంతృప్తి, ప్రపంచ స్థాయి సేవలకు గానూ బలమైన బ్రాండ్ గా నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ‘హెటల్ 50,2022’ వార్షిక నివేదిక ప్రపంచంలోని హోటళ్లకు రేటింగ్స్ ఇస్తోంది.
బ్రాండ్ ఫైనాన్స్ ప్రీమియర్ ఇన్, హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, హాంప్టన్ బై హిల్టన్, ఎంబసీ సూట్స్ హోటల్స్, జేడబ్ల్యూ మారియట్ మరియు షాంగ్రి-లా హోటల్స్ అండ్ రిసార్ట్స్, రెసిడెన్స్ ఇన్ బై మారియట్, వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్స్ అండ్ రిసార్ట్, డబ్ల్యూ హోటల్స్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. టాప్ 10 స్ట్రాంగెస్ట్ హెటల్ బ్రాండ్స్ లో చోటు సంపాదించుకున్నాయి. తాజ్ హోటల్స్ బ్రాండ్ విలువ 6 శాతం పెరిగి 314 మిలియన్ డాలర్లకు చేరింది.
అయితే కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచంలో అన్ని హోటళ్లపై ప్రభావం పడిందని.. అయితే తాజ్ పై కూడా కరోనా ప్రభావం పడిందని. అయితే పర్యాటకుల అవసరాలకు తగ్గట్లుగా తాజ్ తన వ్యూహాలను మార్చుకుందని నివేదిక వెల్లడించింది. తాజ్ వరసగా రెండవ సారి ప్రపంచంలో బలమైన హోటల్ బ్రాండ్ గా గుర్తింపు పొందడం గర్వంగా ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ చత్వాల్ అన్నారు. మా గుర్తింపు అతిథులకు మరింత నమ్మకాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటన సాధించడంలో ఉద్యోగుల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు.