హైదరాబాద్ శివారున వున్న ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. శ్రీ రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా…. 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
ఇవాళ్టి నుంచి 14 వరకు జరిగే… వివిధ కార్యక్రమాలకు… శ్రీరామ నగరాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం ఎప్పుడు ఆవిష్కారం అవుతుందా అని భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లే మార్గాల్లో…. చాలా దూరం నుంచి రామానుజుల వారి విగ్రహం కనువిందు చేస్తోంది. దూరం నుంచే ఆయన శాంత రూపం, పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమ… భక్తి భావాన్ని, ప్రశాంతతను చేకూరుస్తోంది.
కార్యక్రమ వివరాలు
యాగశాల:ఇష్టిశాల, ప్రవచన మండపము:బద్రవేది
2-Feb-2022 బుధవారం ఉదయం-శోభాయాత్ర
వాస్తుశాంతి, ఋత్విక్ వరణ
సాయంకాలం-అంకురార్పణ
3-Feb-2022 గురువారం
ఉదయము అరణిమథనం
అగ్నిప్రతిష్ఠా, హోమాలు:దుష్టనివారణకై – శ్రీసుదర్శనేష్టి,
సర్వాభీష్టసిద్ధికై – శ్రీవాసుదేవేష్టి, శ్రీశ్రీశ్రీ పెద్దస్వామివారి అష్టోత్తర శత నామపూజ, ప్రవచనములు
సాయంకాలం: హోమములు, ముఖ్యఅతిథుల సందేశములు –
4-Feb-2022 శుక్రవారం
ఉదయం: ఐశ్వర్యప్రాప్తికై – శ్రీలక్ష్మీనారాయణేష్టి,
సత్‌సంతానమునకై – వైనతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శత నామపూజ, ప్రవచనములు
సాయంకాలం:ముఖ్య అతిథుల సందేశములు –
5-Feb-2022 శనివారం
వసంతపంచమి
ఉదయం: విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి,
విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి, శ్రీవేంకటేశ అష్టోత్తర శత నామపూజ, ప్రవచనములు
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే శ్రీ రామానుజ 216 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
సాయంకాలం:ముఖ్య అతిథుల సందేశములు –
6-Feb-2022 ఆదివారం
ఉదయం:తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి, పితృదేవతాతృప్తిద్వారా,
విఘ్న నివారణకై – వైభవేష్టి, శ్రీరామ అష్టోత్తర శత నామపూజ,ప్రవచనములు
సాయంకాలం:ముఖ్య అతిథుల సందేశములు
7-Feb-2022 సోమవారం
ఉదయం:అకాలవృష్టి నివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
వ్యక్తిత్వవికాసానికై, ఆత్మోజ్జీవనకై శ్రీకృష్ణ అష్టోత్తరశతనామపూజ, ప్రవచనములు
సాయంకాలం: ముఖ్య అతిథుల సందేశములు
8-Feb-2022 మంగళవారం
రథసప్తమి
ఉదయం:దుష్టగ్రహ బాధా నివారణకై – శ్రీనారసింహేష్టి.
జ్ఞానాజ్ఞానకృత సర్వవిధ పాప నివారణకై – శ్రీమన్నారాయణేష్టి.శ్రీనారసింహ అష్టోత్తర శతనామపూజ
సామూహిక ఆదిత్యహృదయ పారాయణ ధర్మాచార్య సదస్సు
సాయంకాలం:ముఖ్య అతిథుల సందేశములు
9-Feb-2022 బుధవారం
ఉదయం:ఐశ్వర్యప్రాప్తికై – శ్రీలక్ష్మీనారాయణేష్టి
సత్‌సంతానమునకై – వైనతేయేష్టి శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామపూజ, ధర్మాచార్య సదస్సు
సాయంకాలం:ముఖ్య అతిథుల సందేశములు
10-Feb-2022 గురువారం
ఉదయం:అకాలవృష్టి నివారణకై, సస్యవృద్ధికై –వైయ్యూహికేష్టి.
దుష్టగ్రహబాధానివారణకై-శ్రీనారసింహేష్టి శ్రీరామానుజ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనములు
సాయంకాలం: ముఖ్య అతిథుల సందేశములు
11-Feb-2022 శుక్రవారం
ఉదయం:సామూహిక ఉపనయనములు
విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి. వ్యక్తిత్వవికాసానికై, ఆత్మోజ్జీవనకై ప్రవచనములు
సాయంకాలం: ముఖ్య అతిథుల సందేశములు
12-Feb-2022 శనివారం
ఉదయం:భీష్మైకాదశీ తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి.
పితృదేవతా తృప్తిద్వారా విఘ్ననివారణకై – వైభవేష్టి పరవాసుదేవ అష్టోత్తర శతనామపూజ, అష్టోత్తర శత దివ్య దేశనామార్చన,
ప్రవచనములు, భారతదేశ రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ గారిచే బంగారపు రామానుజ విగ్రహ ఆవిష్కరణ
సాయంకాలం:ముఖ్యఅతిథుల సందేశములు
13-Feb-2022 ఆదివారం
ఉదయం సువర్ణ పుష్పార్చన విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి.
జ్ఞానాజ్ఞానకృతసర్వవిధపాప నివారణకై – శ్రీమన్నారాయణేష్టి
సాయంకాలం-ముఖ్య అతిథుల సందేశములు –
14-Feb-2022 సోమవారం
ఉదయము మహాపూర్ణాహుతి,
కుంభప్రోక్షణ, ప్రథమారాధన, ప్రథమ దర్శనము, మహాపూర్ణాహుతి