ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ మధ్య ఏం చేసినా.. సంచలనం అవుతోంది. ఇటీవలే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇదే సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే మరోసారి ఎలాన్ మస్క్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. తనను విమర్శించింనందుకు సొంత ఉద్యోగులనే కొలవుల నుంచి తొలగించాడు.
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు చెందిన కొంతమంది ఉద్యోగులు మస్క్ ప్రవర్తనపై బహిరంగ లేఖ రాశారు. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న కంపెనీ ఈ బహిరంగ లేఖలో ఎవరెవరు పాలుపంచుకున్నారనే దానిపై ఆరా తీస్తోంది. ఇప్పటికే ఈ లేఖతో ప్రమేయం ఉన్న ఉద్యోగులు ఫైర్ చేసింది యాజమాన్యం. బహిరంగంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై లేఖలో పరధ్యానంగా, ఇబ్బందికరంగా ఉంటున్నారని విమర్శలు చేశారు. అయితే కంపెనీ నుంచి ఎంత మందిని తొలగించారనే దానిపై స్పష్టత రాలేదు. అయితే ఈ తొలగింపు యూఎస్ లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తన స్పెస్ ఎక్స్, టెస్లా కంపెనీల ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడిగా కొనసాగుతున్నారు. టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇక తన ప్రైవేట్ స్పెస్ ఎజెన్సీ స్పెస్ ఎక్స్ ద్వారా పాల్కన్ రాకెట్ల ద్వారా శాటిలైట్లను నింగిలోకి పంపడమే కాకుండా డ్రాగన్ క్రూ రాకెట్ తో ఇంటర్నెషన్ స్పెస్ స్టేషన్ కు (ఐఎస్ఎస్) కు పేలోడ్ తీసుకెళ్లడంతో పాటు.. అక్కడ నుంచి భూమిపైకి వ్యోమగాముల్ని తీసుకొస్తున్నాడు.
ఇటీవల 44 బిలియన్ల డాలర్లతో ప్రతీ షేర్ ను 54.20 డాలర్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ ఒప్పందాన్ని ప్రస్తుతం కొంత కాలం వరకు తాత్కాలికంగా నిలిపివేశాడు. ట్విట్లర్ లో ఫేక్ ఖాతాలు తేలేవరకు ఈ ఒప్పందం పూర్తయ్యేలా లేదు. దాదాపు 5 శాతం కన్నా తక్కువగా ఫేక్ ఖాతాలు ఉండటంతో ఈ డీల్ నిలిపివేశామని ఇటీవల మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే.