దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టుకు షాకుల మీద షాకులు తగిలాయి. టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా… ఆదివారం జరిగే నామమాత్రపు మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు వన్డేల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానంలో వేరేవాళ్లకు చోటు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారత జట్టు ఓటమిలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో దీపక్ చాహర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనుంది. మరోవైపు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే అతడి స్థానంలో సిరాజ్ తుదిజట్టులోకి రానున్నాడు.
Read Also: 2022 ఐపీఎల్ వేలంలో 1,214 మంది ఆటగాళ్లు
అటు రెండో వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీకి కూడా మూడో వన్డేలో రెస్ట్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. లేకుంటే రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడవచ్చు. అంతేకాకుండా ఆల్‌రౌండర్ కోటాలో స్థానంలో పొందిన వెంకటేష్ అయ్యర్ దారుణంగా విఫలం కావడంతో అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు తుది జట్టులో స్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.