Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International News Socialist Party Third Time Win Portugal General Ekections

పోర్చుగల్ లో ఎన్నికలు.. మెజారిటీ దిశగా సోషలిస్టు పార్టీ

Published Date :February 1, 2022 , 8:24 am
By GSN Raju
పోర్చుగల్ లో ఎన్నికలు.. మెజారిటీ దిశగా సోషలిస్టు పార్టీ

ఒకవైపు కరోనా మహమ్మారి , మరోవైపు ఆర్థిక సవాళ్లు ..ఈనేపథ్యంలో పోర్చుగల్‌లోని సోషలిస్ట్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయపరంపర కొనసాగిస్తోంది. కోవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోర్చుగల్‌ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్‌ యూనియన్‌ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయం సాధించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. 230 సీట్లున్న పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. మరికొన్ని సీట్లు వస్తే పూర్తి మెజారిటీ సాధ్యం అవుతుంది.

ఈ ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లు సాధించారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్‌–రైట్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్‌ ద్వారా ఓటు వేసే 15 లక్షల మందిని అంగీకరించలేదు.

ర‌ష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: నాటో అలా… బ్రిట‌న్ ఇలా…

మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రధాని ఆంటినో కోస్టా. ఈ సందర్భంగా ఆయనకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కావాలని భారత్ కోరుకుంటోందన్నారు. ప్రస్తుతానికి 106 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ మరికొన్ని చిన్నపార్టీల సాయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

కీలకమయిన సంక్షోభ సమయంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగానే వున్నాయని చెప్పాలి. పేదదేశం అయిన పోర్చుగల్ కి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. వీటిలో ఎక్కువభాగం మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు అందిస్తారు. 2015లో అధికారంలోకి వచ్చింది సోషలిస్టు పార్టీ. అయితే బడ్జెట్‌ను ఆమోదింప చేసుకునేందుకు మిత్రపక్షాలైన లెఫ్ట్‌ బ్లాక్, పోర్చుగీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీలపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది.

సోషలిస్టు పార్టీతో పాటు దేశంలో ఈసార చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడేళ్ళ క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను సాధించింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటు సాధించింది. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్‌ నమోదైంది. గతంలో కంటే పోలింగ్ శాతం తగ్గింది.

ntv google news
  • Tags
  • Elections 2022
  • europian
  • modi wishes
  • pm antonio costa
  • portugal

WEB STORIES

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే..

"Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే.."

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

RELATED ARTICLES

FIFA World Cup: పోర్చుగల్‌ గోల్స్ మోత.. ప్రపంచకప్ నుంచి స్విట్జర్లాండ్ నిష్క్రమణ

Village for Sale : బంపర్ ఆఫర్.. మీ దగ్గర రూ.2కోట్లుంటే ఆ గ్రామాన్నే కొనేయొచ్చు

Portugal: పోర్చుగల్‌లో భారతీయ గర్భిణి మృతి.. నైతిక బాధ్యత వహిస్తూ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా

Adilabad Trs: కేడర్ తీరుతో కలవరం

Punjab Politics: వేడెక్కిన రాజకీయం.. చన్నీ వర్సెస్ రబియా సిద్దూ

తాజావార్తలు

  • OG: అనిరుధ్ అవుట్, తమన్ ఇన్… ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే

  • Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో యాత్ర ముగింపు సభ.. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా?

  • Taj Mahal : ప్రేమికులకు షాక్.. మూతపడనున్న తాజ్ మహల్

  • TTD New App: టీటీడీ యాప్ కి భక్తుల నుంచి అనూహ్య స్పందన

  • Crime News: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు..

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions