ఏవైనా స్పెషల్ డేస్ వస్తే రోహిత్ శర్మకు ఊపు వస్తుందని మరోసారి రుజువైంది. దీపావళి పండగకు, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. దీపావళి అంటే చాలు రోహిత్ రెచ్చిపోతున్నాడు. దీపావళి సందర్భంగా ఆరోజు లేదా అంతకుముందు రోజు జరిగే మ్యాచ్‌లలో రోహిత్ విశ్వరూపం చూపిస్తున్నాడు.
Read Also: టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్
2013లో దీపావళి సమయంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు సాధించాడు. 2018లో వెస్టిండీస్ జట్టుపై 111 పరుగులు చేశాడు. 2019లో దక్షిణాఫ్రికా జట్టుపై (212) టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. 2020లో కెప్టెన్ గా ఐదో ఐపీఎల్ ట్రోఫీని సాధించాడు. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 74 పరుగులు చేసి తన తడాఖా చూపించాడు. దీపావళికే కాదు తన భార్య పుట్టినరోజున, పెళ్లి రోజున కూడా రోహిత్ గతంలో భారీ స్కోర్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.