హైదరాబాద్ నగరంలో రవాణాను వేగవంతంగానిర్వహించే ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి (రైల్ నెంబర్: 47150),
Read Also: సంగారెడ్డిలో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య
లింగంపల్లి-సికింద్రాబాద్ (రైల్ నెంబర్: 47195) సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. (నెంబర్: 07762) కాలాబురాగ్-బీదర్ డెమో, (నెంబర్: 07763) బీదర్-కాలాబురాగ్ డెమూ, (నెంబర్: 07791) కాచిగూడ-నడికుడి డెమూ, (నెంబర్: 07792) నడికుడి-కాచిగూడ రైళ్లను ఈనెల 23వ తేదీన రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.