పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాలను సీఎం జగన్ ఏర్పాటుచేశారన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్.పేరు పెట్టి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకున్నారే తప్ప ఆయన కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రయత్నం చేయలేదన్నారు.
Read also: 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం ఓ మైలురాయి: సీఎం జగన్
ఎన్టీఆర్‌ను చంద్రబాబు అన్ని విధాలా అవమానపరిచాడని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారన్నారు. అందుకే కరుడు కట్టిన ఎన్టీఆర్ అభిమానులు కూడా జగన్‌ను అభినందిస్తున్నారన్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కొందరూ కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిదన్నారు.