కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్ర్తీలు, మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించేందుకు అనిమీయా ముక్త్ భారత్ పేరుతో పథకాన్ని అమలు చేస్తుందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. అనీమియా ముక్త్ భారత్ పథకాన్ని తెలంగాణలో నీరుగార్చాలని రాష్ర్ట ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కోటి పదిలక్షల మందుల స్టిప్స్, వైద్యపరికారాలను సేకరించే టెండర్లలో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా టీఎస్‌ఎంఐడీసీ వ్యవహారించింది. మేక్ ఇన్ ఇండియాను తుంగలో తొక్కి ఇతర దేశాల నుంచి వైద్య పరికరాలు, మందులను దిగుమతి చేసుకున్నారు.
Read Also: కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణరావు
తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన రెండు కోట్లను స్వాహా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాల్సిందిగా సీబీఐ, విజిలెన్స్ కమిషన్‌కి లేఖ రాస్తున్నట్టు ప్రభాకర్ చెప్పారు. ముడుపులు ముట్టడంతోనే టెండర్లను రద్దు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. టెండర్లను వెంటనే రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖకు సంబంధించిన మంత్రి పాత్ర కూడా ఇందులో ఉందని ప్రభార్ చెప్పారు. దీనిపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.