‘భారతరత్న’ అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది లతాజీ మరణం. ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక లతాజీ చివరి చూపు కోసం ప్రధాని కూడా రాబోతున్నారు.
Read Also : బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ?
తాజాగా లతా మంగేష్కర్ మృతదేహం ప్రభు కుంజ్‌కు చేరుకుంది. మృతదేహాన్ని సందర్శనార్థం కోసం ఆమె ఇంట్లో ఉంచుతారు. శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సాయంత్రం 4:15 గంటలకు ముంబై చేరుకుని లతాజీ చివరిసారిగా కన్నీటి నివాళిని అర్పించనున్నారు. అయితే ప్రధాని మోడీ అంత్యక్రియల్లో పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. సాయంత్రం 6:30 గంటలకు శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లతాజీ అంత్యక్రియలకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివాజీ పార్క్ చేరుకున్నారు.