ఐదేళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఆరు నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ ఫైజర్.. ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్ నిలవనుంది. అమెరికాలో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది.
Read Also: కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు
ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే కరోనా వ్యాక్సిన్ పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఎఫ్‌డీఏకు ఫైజర్ తెలిపింది. ఇది దేశంలో పాఠశాలలకు వెళ్లని సుమారు కోటి 90 లక్షల చిన్నారుల కోసం రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. భవిష్యత్ వేరియంట్లను ఎదుర్కోవడంతో పాటు పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్‌డీఏతో కలిసి పనిచేస్తామని పేర్కొంది.