తెలంగాణ-ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కోసం నేను ఎన్నోసార్లు తీవ్ర ప్రయత్నం చేశానన్నారు మాజీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. విజయవాడలో లారీ ఓనర్ల సంఘం సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కోసం మూడేళ్లుగా మేము చేయని ప్రయత్నమంటూ లేదు.ఆర్టీసీకి కాకపోయినా లారీ ఓనర్లకైనా పర్మిట్లు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నించా.
కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక తెలంగాణ లారీ ఓనర్లే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.ఏపీ ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా భరించేందుకు సిద్దమై కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసం ప్రయత్నించాం.మూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నించినా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు సాధించలేక పోయా.పర్మిట్లపై తెలంగాణ ప్రభుత్వం, అధికారుల నుంచి కనీస స్పందన లేదు.తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడం వల్లే పర్మిట్లు సాధించలేక పోయాం.
వచ్చి కలుస్తామని తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ సునీల్ శర్మను మేం కోరినా స్పందించ లేదు.కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసం ఇకపై కూడా ప్రయత్నించాలని మంత్రి విశ్వరూప్ ను కోరుతున్నా.లారీ ట్రాన్స్ పోర్టు రంగం ఎప్పటికీ బతికుండాలి.ఈ రంగం చస్తే రాష్ట్రానికి, దేశానికి, వేలాది కుటుంబాలకు చాలా ఇబ్బందులు వస్తాయి. లారీ ట్రాన్స్ పోర్టు రంగానికి జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పేర్ని నాని.
Minister Viswaroop: లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తా