దేశంలో ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూను విధించారు. మరి కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను విధించడంతో పాటు కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా వేగంగా విజృంభిస్తూ పంజా విసురుతుంది. వ్యాక్సినేషన్ పూర్తిగా వేసుకున్న తట్టుకోవడం అంత సులువేం కాదనే అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చాయి. బూస్టర్ డోస్‌తో దీన్ని ఎదుర్కొవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ పరిశోధన అందర్ని కలవర పెడుతుంది. దేశంలో ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది.
Read Also: కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి ప్రసవం చేసిన వైద్యులు
తాజాగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని దీనిపై పరిశోధన జరిపిన ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వేరియంట్ విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దాని కన్నా దేశీయ వ్యాప్తే అధికంగా ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికుల్లో ఈ వేరియంట్‌ను తొలుత గుర్తించారని తెలిపింది. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మందికి లక్షణాలు కనపడడం లేదని పేర్కొంది.కొందరిలో స్వల్ప లక్షణాలు కనపడుతున్నట్టు తెలిపింది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని ఈ పరిశోధనలో తేలింది. అయినప్పటికీ ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీ, ముంబైలో అధికంగా ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది.