సాధారణంగా వన్డే మ్యాచ్‌లలో సెంచరీ చేయడమే గొప్ప విషయం. అలాంటిది ఇప్పుడు ఆటగాళ్లు టీ20 మ్యాచ్‌లలోనూ అతి కష్టం మీద సెంచరీ పూర్తి చేస్తున్నారు. అది కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటేనే ఇది సాధ్యపడే విషయం. కానీ 10 ఓవర్ల మ్యాచ్‌లో ఓ ఆటగాడు సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదండోయ్. తాజాగా వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ10 మ్యాచ్‌లోనూ సెంచరీ బాదేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. లెథర్‌బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఈ అద్భుతం చోటుచేసుకుంది.
నికోలస్ పూరన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయంటేనే అతడి విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే నికోలస్ పూరన్ ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం అతడు తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇది ఐపీఎల్‌లో పూరన్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మెగా వేలంలో పూరన్‌ను రూ.10.75 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Genius at work! 😱@nicholas_47 hit a ton off just 3️⃣7️⃣ balls including 6️⃣ fours and 1️⃣0️⃣ massive sixes to take the Leatherback Giants to a comfortable 9️⃣-wicket win! 👏
— FanCode (@FanCode) March 1, 2022
📺 Watch the best moments from this match on #FanCode 👉 https://t.co/c8dKvIy6GE pic.twitter.com/h5G2lrEo8s