ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత భీకర స్థాయిలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇవే ఆంక్షలు స్వయంగా ఓ దేశ ప్రధాన మంత్రి వివాహాన్ని అడ్డుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
Read Also: గిన్నిస్ రికార్డు: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి
కరోనా ఆంక్షల నడుమ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వారు వాయిదా వేసుకోవాలని న్యూజిలాండ్ ప్రధాని విజ్ఞప్తి చేశారు. తాను అదే పని చేశానని వెల్లడించారు. కోట్లాది మంది న్యూజిలాండ్ ప్రజలలో తానూ ఓ సామాన్యురాలినేనని, వారికంటే తానేమీ భిన్నం కాదని స్పష్టం చేశారు. అందుకే తన పెళ్లిని రద్దు చేసుకున్నానని చెప్పారు. చాలాకాలంగా ప్రధాని జసిండా.. క్లార్గ్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తోన్నారు. త్వరలోనే తాను ఆయనను పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఇటీవల ప్రకటించారు. అయితే వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు.