నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు…బురద చల్లు తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ తో పాటు ఒకరిద్దరు రండలు చేస్తున్న లుచ్చా నాటకం ఇది అంటూ మంత్రి విమర్శించారు. త్వరలో వాళ్ళ పేర్లు ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. గతంలో లుచ్చా నా కొడుకులు ఓటరు జాబితా నుంచి నా ఓటు తీయించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
Read Also: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి..బీజేపీ ఎంపీ అరవింద్ సవాల్
నేను నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు నన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బి ఫార్మ్‌తో పాటు ఇచ్చిన అఫిడవిట్ మాత్రమే ఫైనల్ అని మంత్రి అన్నారు. వెహికిల్ చాలన్ కట్టలేదని కేసు పెడితే ఎలక్షన్‌లో ఎవ్వరూ మిగలరన్నారు. నా అఫిడవిట్ పై ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేస్తే…విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసిందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. డిసెంబర్ 2021లో ఢిల్లీ హైకోర్టు పిటిషన్ విచారణ ను ముగించిందని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీస్తామన్నారు. ఇతరులు వేసిన పిటిషన్ లు తెలంగాణ హైకోర్టు లో విచారణలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.