మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. కాగా కొందరు మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి నలుగురు ఐదుగురు కలసి ఏదో చేయాలని.. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీ తల్లిదండ్రులను అడగండి.. అప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో వారే చెబుతారు అంటూ మంత్రి వారికి చురకలు అంటించారు.
Read Also: 317 జీవోను తక్షణమే రద్దు చేయాలి: కోదండరాం
మేము మిమ్మల్ని చూసుకోండని మా కార్యకర్తలకు పిలుపునిస్తే.. మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి. పనులు అడగండి చేస్తాం. మా సీఎం కేసీఆర్‌ను అడిగైనా సరే నిధులు తెస్తాం.. ప్రజలు అడిగితే.. కురుమూర్తి స్వామి ఆలయం దాకా రోప్‌వేను కూడా తీసుకొస్తాం.కానీ రాజకీయాలు చేస్తే సహించం అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. వాట్సాప్.. ట్విట్టర్‌లను నమ్ముకుని ఊరుకులాడుతున్నారు. మీరు అధికారంలో ఉండగా ఏమి చేశారో చెప్పండి.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ను జైళ్లో పెడితే .. లక్షలాది మంది ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. జైలు గోడలు బద్ధలు కొడతాం.. చరిత్రను తిరగరాసే పరిస్థితి వస్తది. మనం మౌనంగా ఉన్నామని అడ్డమైన వాళ్ళు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. మేము బూతులు మాట్లాడితే తట్టుకోలేరు. తెలంగాణా అంటే తుపాకిలో గుండు లాంటిది.. మనిషిలో గుండె కాయ లాంటిదని అంటూ ప్రతిపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు.