వర్షకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నాలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తుంటాయి. వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. నగరంలో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని, నాలాలకు ఫెన్సింగ్, రక్షణ గోడ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు.
Read Also షాకింగ్: ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తే…
నాలా ప్రమాదాలు జరిగితే ఇకపై అధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నాలా ప్రమాదాలు జరగకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. నాలాల పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రతివారం సమీక్షించాలని, మేజర్ కార్పొరేషన్లలోనూ నాలాలపై రక్షణ చర్యలకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ వివరించారు. నాలాల విషయంలో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు మంత్రి కేటీఆర్.