తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కేంద్రం కాలం వెళ్లదీస్తుందన్నారు. పైగా రాష్ట్రాల విషయాలలో అడ్డుతగులుతుందని ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా,సర్వీసు రూల్స్‌ను సవరిస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
Read Also: పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవద్దా..? : మంత్రి హరీష్ రావు
అధికారాలను పూర్తిగా కేంద్రీకృతం చేస్తున్నదన్నారు.తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది, సంక్షేమంతో పాటు ఈ విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉదన్నారు. ప్రభుత్వ పథకాలను వర్తింప జేయడంలో ఎలాంటి భేదభావాన్ని ప్రభుత్వం చూపెట్టబోదన్నారు. కేంద్రం రాష్ట్రాల నిర్ణయాలను గౌరవించాలని మంత్రి కేటీఆర్ కోరారు.