కోఠి ఈఎన్టీ హాస్పిటల్ లో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి హరీష్ రావు అక్కడున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు అద్భుతంగా వున్నాయని పేషెంట్లు తెలపడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ నిజమే కదా అంటూ హరీష్ రావు చిరునవ్వు వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు అద్భుతమని మరోసారి రుజువైందని రాజాసింగ్ తో హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కళ్ళ ముందు నిజం కనిపించడంతో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ మంత్రులు, శాసన మండలి, శాసన సభ్యులు ఆధ్వర్యంలో 18 ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ హాస్పిటల్ కు సీఎం మరిన్ని డాక్టర్ పోస్టులు మంజూరు చేశారని అన్నారు. రూ.35 కోట్లతో బిల్డింగ్ నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో 100 పడకలు, 8 ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి హరీష్ రావ్ అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అని తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తమిళనాడును దాటి తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. బస్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్, టీ డయాగ్నసిస్ సర్వీసులు దేశానికి ఆదర్శంగా మారాయని చెప్పారు. తెలంగాణ మోడల్ ను మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మంత్రి చెప్పారు.
Bandi Sanjay: ఎఫ్.సి.ఐ. తనిఖీలపై సన్నాయి నొక్కులా?