Varanasi : రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే నిన్న జరిగిన గ్రాండ్ ఈవెంట్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ప్రత్యేకంగా మహేశ్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చగా మారాయి. ఈవెంట్లో మాట్లాడిన మహేశ్ బాబు, ..ఇలాంటి సినిమా చేసే అవకాశం ఒక నటుడి జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు ఆ అరుదైన ఛాన్స్ దక్కింది. ఇది ఇండియా గర్వించే సినిమా అవుతుంది” అని తెలిపాడు.
Read Also : Balakrishna : అభివృద్ధి చేశా కాబట్టే ఆదరిస్తున్నారు.. బాలకృష్ణ కామెంట్స్
మహేశ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ సినిమా స్కేల్‌పై అంచనాలు పెరిగాయి. వారణాసి పాన్ ఇండియా మూవీ కాదని, భారీ విజన్‌తో, న్యూ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా అని క్లియర్ గా అర్థం అవుతోంది. రాజమౌళి స్టాండర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి ఆయన తీసుకొస్తున్న స్కేలు హాలీవుడ్ రేంజ్‌ను తాకే అవకాశం ఉందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో నడుస్తోంది. మహేశ్ బాబు, రాజమౌళి ఇద్దరి కాంబినేషన్ మొదటిసారి రావడం, అందుకు తగ్గట్టుగా సినిమా బడ్జెట్, టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా ప్రపంచ స్థాయిలో ఉండబోతున్నాయని భావిస్తున్నారు.
Read Also : Andhra King Taluka : ఆంధ్రాకింగ్ తాలూకా రిలీజ్ డేట్ లో మార్పు..