టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధించారు. మాకు రోడ్లు లేవు. నీరు లేవు… నిజమే. మా రాష్ట్రం పరిస్థితి అంతా అయిపోయింది. నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయి. మీరు తగ్గద్దు. పుష్ప డైలాగ్ రిపీట్ చేశారు. కేటీఆర్ మాట తప్పద్దు. మీరు రాబోయే లీడర్. నువ్వు మాట్లాడింది నిజమే. దాన్నుంచి వెనక్కి తగ్గద్దు. నేను నిజంగానే అన్నా.. Tongue Slip కాలేదని చెప్పమని సలహా ఇచ్చారు జేసీ. నేను బీజేపీలోకి వెళతానన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. నాకు రావాల్సిన పార్టీలోనే టికెట్ వస్తుందన్నారు.
నేను పార్టీమారేది వుంటే ముందే చెబుతాం. రాష్ట్రంలో మీరు లేరా? తల్లి సరిగా పెంచలేదన్న హోంమంత్రి వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి సరిగా పెంచడం కుదరక తాత దగ్గర జగన్ పెరిగారు. పెద్దాయన్ని ఏం అనద్దు. ఆయన బాగానే పెంచారు. మంత్రులు ఏపీలో ఏం చేయలేరు. సంతకాలు మాత్రం పెడతారు. ఎస్పీని కలిసి వచ్చాను. ఆయన మంచోడు. ఆయన చేతిలో ఏంలేదు. సజ్జల చేతిలో అంతా వుంది.