Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lemon Pickle: భారతీయ వంటకాల్లో ఊరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ విటమిన్ ‘C’ పుష్కలంగా లభించే నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు. నోటికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మందికి నిమ్మకాయ పచ్చడి పెట్టిన కొద్ది రోజులకే పాడైపోతుందనే భయం ఉంటుంది. కానీ సరైన కొలతలతో, కొన్ని చిట్కాలు పాటిస్తూ పచ్చడి పెడితే సంవత్సరం పైనే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది.మరి నిమ్మకాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
కావలసిన పదార్థాలు:
* నిమ్మకాయలు: 25 (సుమారు 1 కేజీ)
* ఉప్పు: అర కప్పు (50 గ్రాములు)
* కారం: అర కప్పు కంటే కొంచెం ఎక్కువ (50 – 60 గ్రాములు)
* పసుపు: 1 టీస్పూన్
* మెంతులు: 1 టీస్పూన్
* ఆవాలు: 2 టీస్పూన్లు (పొడి కోసం) + 1 టీస్పూన్ (పోపు కోసం)
* జీలకర్ర: అర టీస్పూన్
* ఇంగువ: అర టీస్పూన్
* నూనె: ముప్పావు కప్పు (200 గ్రాములు – నువ్వుల నూనె లేదా పల్లీల నూనె శ్రేష్ఠం)
* వెల్లుల్లి రెబ్బలు: 12 – 15 (పొట్టు వలిచినవి)
* కరివేపాకు: తగినంత
Also Read
- Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
తయారీ విధానం:
నిమ్మకాయల ఎంపిక:
ముందుగా పచ్చడి కోసం మంచి ముదురు రంగులో ఉండి, పలచని తొక్క ఉన్న తాజా నిమ్మకాయలను ఎంచుకోవాలి. ఇలాంటి వాటిలో రసం ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయలను బాగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఓ 10-15 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎక్కడా తడి తగలకూడదు.
ముక్కలు & రసం వేరు చేయడం:
తీసుకున్న 25 నిమ్మకాయలలో మచ్చలు లేని మంచి నిమ్మకాయలను ముక్కల కోసం, మిగిలిన వాటిని రసం కోసం వేరు చేయాలి. ఇక్కడ 13 కాయలను ముక్కల కోసం, 12 కాయలను రసం కోసం వాడుతున్నాం. ముక్కల కోసం నిమ్మకాయలను అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. ప్రతి కాయను 4 లేదా 8 ముక్కలుగా కట్ చేసి, అందులోని గింజలను పూర్తిగా తీసేయాలి. రసం కోసం.. రసం పిండాల్సిన కాయలను అడ్డంగా కట్ చేసి, రసాన్ని ఒక గిన్నెలో ఉన్న నిమ్మకాయ ముక్కలపై పూర్తిగా పిండాలి. ముక్కలు రసంలో మునిగేలా ఉంటే ఊట బాగా వస్తుంది.
ఊరబెట్టడం:
ఇప్పుడు ఈ ముక్కలు, రసం ఉన్న గిన్నెలో 1 టీస్పూన్ పసుపు, అర కప్పు (50 గ్రాములు) ఉప్పు వేసి బాగా కలపాలి. నిమ్మకాయల పులుపును బట్టి ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో పోసి మూత పెట్టి, 8 నుండి 10 రోజుల పాటు ఊరబెట్టాలి. రోజు మార్చి రోజు లేదా ప్రతిరోజూ ఒక పొడి చెంచాతో ఈ ముక్కలను పైకి కిందకి కలుపుతూ ఉండాలి. ముక్కలు ఎంత బాగా ఊరితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది.
మసాలా పొడి తయారీ:
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టీస్పూన్ మెంతులు వేసి దోరగా వేపాలి. అవి కొద్దిగా వేగాక అర టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్ల ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
పోపు వేయడం:
అదే పాన్‌లో ముప్పావు కప్పు (200 గ్రాములు) నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేపాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేపడం ముఖ్యం, లేదంటే పచ్చడి బూజు పట్టే అవకాశం ఉంది. చివరగా పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వాలి.
పచ్చడి కలపడం:
బాగా ఊరిన నిమ్మకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో అర కప్పు కంటే కొంచెం ఎక్కువ కారం (50-60 గ్రాములు), మనం తయారు చేసి పెట్టుకున్న ఆవ-మెంతి పొడి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన పోపును కూడా ఇందులో పోసి బాగా మిక్స్ చేయాలి. అంతే తయారు చేసుకున్న పచ్చడిని వెంటనే తినడం కంటే 1 లేదా 2 రోజుల తర్వాత తింటే ముక్కలకు కారం, పోపు బాగా పట్టి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తడి లేని ఎయిర్ టైట్ గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఏడాది పాటు రంగు, రుచి మారకుండా అద్భుతంగా ఉంటుంది. పచ్చడిని వాడుకునేటప్పుడు పొడి చెంచా మాత్రమే వాడాలి. ఈ పక్కా కొలతలతో మీరు కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా నిమ్మకాయ నిల్వ పచ్చడిని తయారు చేసి, దాని కమ్మని రుచిని ఆస్వాదించండి.
తాజావార్తలు
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?