కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన హామీలు ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు.ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, మెట్రోరైలు వంటివి ప్రస్తావనే లేదన్నారు సీపీఎం నేతలు.
కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ నేతలు నిరసన తెలిపారు. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం చెందారు. విశాఖ సీపీఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు సీపీఐ నాయకులు, కార్యకర్తలు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నారు. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు . రైల్వేస్ పరంగా ఏపీకి ఎటువంటి కేటాయింపులు లేవు.
ప్రధాని హోదాలో మోడీ రైల్వే జోన్ పై విశాఖలో హామీ ఇచ్చారు. ఓఎస్డీని పెట్టి మూడేళ్లవుతున్నా ఎటువంటి కేటాయింపులు లేకుండా తాత్సారం చేస్తున్నారు. కార్పొరేట్ రంగానికి అనేక రాయితీలు ఇచ్చారు కాబట్టే నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పరుగులు పెట్టిందన్నారు.రైల్వేజోన్ కి సంబంధించి కలిసొచ్చే వారందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు.