హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే గులాబీ బాస్ సీఎం కేసీఆర్.. సంక్షేమ పథకాలు దృష్టిసారించగా… అటు మంత్రి కేటీఆర్… పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యలోనే టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం, హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కేటీఆర్ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.