Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో సుజీత్, సందీప్ సంయుక్తంగా డైరెక్షన్లో కెరీర్ లోనే మంచి హిట్ అందుకున్నారు. మరీ ముఖ్యంగా రిలీజ్ కు ముందే భారీ హిట్ కొడతానని చెప్పి కొట్టారు. నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్, రూల్స్ రంజన్ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు రూ.50 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన క మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నిర్మాణంలోనూ భాగమైనందుకు రెమ్యునరేషన్ తోపాటు లాభాలు కూడా తీసుకున్నారు.
Read Also:Naresh Balyan: దోపిడీ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
అయితే ఇప్పుడు దిల్ రుబా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కిరణ్ అబ్బవరం. నిజానికి క మూవీ కన్నా ముందే దిల్ రుబా రావాల్సి ఉంది. ఎందుకో ఏమో తెలియదు కానీ.. సినిమాను విడుదల కాలేదు. కొత్త డైరెక్టర్ విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఆ లవ్ ఎంటర్టైనర్ మూవీని ఇప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే క మంచి సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు కెరీర్ ను సరైన రీతిలో నిలబెట్టుకునేందుకు ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిర్మాతల నుంచి అడ్వాన్సులు వస్తున్నప్పటికీ.. తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు కిరణ్.
Read Also:Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?
ఇప్పుడు మారుతి, ఎస్ కే ఎన్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. మారుతి, ఎస్కేఎన్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. K- RAMP అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారినా.. అదే ఏ సినిమాకు టైటిల్ అన్న విషయం క్లారిటీ లేదు.