జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు(EMK) షోకు జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌కు హోస్టుగా వ్యవహరించిన తారక్ మరోసారి అలాంటి అవతారం ఎత్తిన షో EMK మాత్రమే. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8:30 గంటలకు ప్రసారమవుతోంది. కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దీంతో EMK ఫస్ట్ వీక్ టీఆర్పీ 6.76గా నమోదైంది.
Also Read: “అనుభవించు రాజా” రిలీజ్ డేట్ ఫిక్స్
జూనియర్ ఎన్టీఆర్ స్టామినా కారణంగా రెండో వారం కూడా EMK 6.48 టీఆర్పీని సొంతం చేసుకుంది. ఇక మూడో వారం ఏకంగా 7.3 టీఆర్పీ సాధించింది. దీంతో ఈ షో బాగా సక్సెస్ అవుతుందని నిర్వాహకులు భావించారు. కానీ నాలుగో వారం నుంచి టీఆర్పీ మళ్లీ తగ్గిపోతూ వచ్చింది. నాలుగో వారంలో 6.59 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక ఐదో వారంలో 5.4 రేటింగ్ మాత్రమే రాగా 6వ వారంలో 4.01 రేటింగ్ నమోదైంది. ఇక 7వ వారం 3.12 రేటింగ్ వచ్చింది. ఇక 8వ వారంలో దిగజారి 2.87 రేటింగ్ సాధించింది. అయితే 9వ వారంలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు 3.17 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక రాబోయే వారాల్లో ఈ షోకు మరింత టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీపావళి సందర్భంగా ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు గెస్టుగా కనిపించనున్నాడు. ఈ ఎపిసోడ్‌కు కూడా మంచి టీఆర్పీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.