తెలంగాణపై మోడీ మాటలు మంటలు రాజేస్తున్నాయి. తెలంగాణకు తల్లి లాగా..సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని, మోడీ..కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీమాంధ్రకు కూడా ఆర్దికంగా ఆదుకోవడం కోసం పోలవరం..స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కాంగ్రెస్. ఎనిమిదేళ్ళలో విభజన హామీలు అమలు చేయకుండా మోడీ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారన్నారు.
తెలంగాణ అప్పుల ఊబిలోకి పోవడానికి మోడీ..కేసీఆర్ కారణం అన్నారు. తెలంగాణలో ఆశించిన ఉద్యోగాల కల్పన లో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. ఐటీఐఆర్ గురించి అసలు కేసీఆర్ మాట్లాడనే లేదు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది కాంగ్రెస్. కర్ణాటకలో మత వివాదాలకు దారి తీస్తుంది బీజేపీ. ఉద్దేశ పూర్వకంగా ఐదు రాష్ట్రాల్లో లబ్దిపొందే విధంగా కుట్రలు చేస్తోంది బీజేపీ.
అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదన్నారు జీవన్ రెడ్డి. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో బీజేపీ వాళ్లు ఎవరైనా ఉన్నారా..!?ఇందిరా గాంధీ..రాజీవ్ గాంధీలే దేశానికి ఆదర్శ నాయకులు. త్యాగాల పార్టీ కాంగ్రెస్ అన్నారు జీవన్ రెడ్డి.