ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డీ గ్యాంగ్‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెడ్డి గ్యాంగ్‌కు విఙప్తి అంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సెటైర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డి గ్యాంగ్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, సలహాదారుల ఇళ్లల్లో దోచుకోవాలి.
చెడ్డి గ్యాంగ్ నగర శివారులలో సామాన్య ప్రజల ఆస్తులను దోచుకోవద్దుని నా మనవి @YSRCParty ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సలహాదారులును దోచుకుంటే మీకు వేల కోట్ల రూపాయలు డబ్బులు దొరుకుతాయి. @APPOLICE100 @VjaCityPolice @JSPShatagniTeam @JSPVijayaWest pic.twitter.com/en1LTmtDTB
— Pothina venkata mahesh (@JSPpvmahesh) December 7, 2021
నగర శివారుల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో దోపిడీలు చేయడం సరికాదు. వైసీపీ నేతల ఇళ్లల్లో బోల్డంత డబ్బు ఉంది.. వాటిని దోచుకోండి. ముఖ్యంగా మంత్రి వెలంపల్లి ఇంటిని దోచుకుంటే కోట్లాది రూపాయల డబ్బు లభిస్తుంది.వెలంపల్లి ఇంట్లో అన్ని 2 వేల నోట్ల కట్టలు బస్తాల్లో ఉన్నాయి.వెలంపల్లి ఇంటిలో అమ్మవారి రథానికి చెందిన మూడు సింహాల బొమ్మ దొరికితే చెట్టు తొర్రలో పెట్టి వెళ్లిపోండి. రాష్ట్రంలో అక్రమాలు.. దాడులు.. విధ్వంసాలు సృష్టించే వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదు.అలాగే దోపిడీలు చేసే చెడ్డీ గ్యాంగుల పైనా పోలీసులు కేసులు పెట్టరనే భావిస్తున్నా అని ట్వీట్ చేశారు పోతిన మహేష్. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.