ముంబైలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వెలుపల భారీ పోలీసులను మోహరించారు. ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలి యాకు ముప్పు ఉందని ఒక టాక్సీ డ్రైవర్ సూచించడంతో భద్రతను పెంచారు. తాజాగా పోలీసులు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు.
ఏం జరిగింది?
టాక్సీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఒక క్యాబ్‌లో కొంతమంది అనుమా నాస్పద వ్యక్తులు సోమవారం యాంటిలియా అడ్రస్‌ను అడిగారు. అతను వారిని ఆన్‌లైన్‌లో వెతకమని సూచించాడు. అయితే క్యాబ్ డ్రైవర్ అడ్రస్ అడిగిన తీరులో ఏదో లోపం ఉందని భావించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు. అడ్రస్ అడిగిన క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసులు వెతకడం ప్రారం భించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
అనుమానస్పద డ్రైవర్‌ను ముంబై పోలీసులు వాషిలో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు.. అతడిని విచారించారు. ఎలాంటి బెదిరింపులు లేవని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు గుజరాత్ నుండి వచ్చారు. వారు గేట్‌వే ఆఫ్ ఇండియా వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. దాంతో పాటుయాంటిలియాను చూడాలని కోరుకున్నారని ఆ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు అందుకే అతడు యాంటీలియా అడ్రస్ అడిగానని చెప్పాడు. పోలీసులు అత డికి ఎలాంటి నేర చరిత్ర లేదని నిర్ధారించిన తర్వాత ఆడ్రైవర్ ను వదిలిపెట్టారు.