అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఏ ఉత్సవాలు జరిగినా.. ఏదో ఒక అలజడి, వివాదం రేగుతూనే వుంటుంది. ఇంద్రకీలాద్రి పై మళ్లీ చీరాల గోల్ మాల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఏడాది కనిపించకుండా పోయిన అమ్మవారి చీరాల లెక్కలు చెప్పాలంటూ రాష్ట్ర ఆడిట్ అధికారులు అడగడంతో ఇంద్రకీలాద్రి అధికారులు ఈ వ్యవహారం కాస్త బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏడాది కూడా కనిపించకుండా పోయిన చీరాల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు మరో మారు ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది.
2019- 20 ఏడాదికి సంబంధించి ఆడిట్ జరగకపోవడంతో ఇప్పుడు ఆ లెక్కలపై రాష్ట్ర ఆడిట్ అధికారులు దృష్టి పెట్టడంతో మరో మారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ చీరల మాయంపై ఎప్పటి నుండో అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ అటు ఆలయ అధికారులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక సార్లు చీరలు మాయం అవ్వటం జరిగింది. బాధ్యులను సస్పెండ్ చెయ్యటం కూడా జరిగింది. అయినా కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారి చీరల కౌంటర్ వద్ద ఎలాంటి మార్పు వస్తున్న పరిస్థితి లేదు.. చీరలు మాయం అవ్వటం, దొంగను పట్టుకుని అక్కడే మళ్ళీ వేరే డిపార్ట్ మెంట్ కు ఇవ్వడం ఇంద్రకీలాద్రి పై సర్వసాధారణం అయిపోయింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత నిజం అవుతోంది. ఇంద్రకీలాద్రి ఇంటి దొంగలను కనిపెట్టిన ఇక్కడేం చెయ్యలేరు అన్నట్లుంది ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి…
తాజాగా గత నాలుగు రోజులుగా ఇంద్రకీలాద్రిపై వివిధ విభాగాల్లో జరుగుతున్న ఆడిట్స్ లో ఐదుగురు స్పెషల్ స్టేట్ ఆడిట్ సభ్యులు తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో భాగంగానే చీరల విభాగంలో గత ఏడాది ఆడిట్ జరగకపోవడంతో కనిపించకుండా పోయిన 70 చీరల లెక్కలు చెప్పాలంటూ ఆలయ ఈఓ భ్రమరాంబను అడిగారు. ఆడిట్ లో మిస్ అయిన చీరలు వాటి వ్యవహారానికి సంబంధించి రిపోర్ట్ రాసే ప్రయత్నంలో కూడా ఆలయ అధికారులు అడుపడ్డట్లుగా తెలుస్తుంది.అధికారులు గట్టిగా అడిగటంతో ఉత్సవాల్లోనూ ఇతర వాటికి వాడినట్లు ఆ సెక్షన్ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది సరిగా లేకపోవటంతో దానికి సంబంధించి మొత్తం లెక్కలు మంగళవారం ఇవ్వాలని ఆలయ అధికారులకు ఆడిట్ సభ్యులు సూచించారు.
గత కొంత కాలంగా ఇంద్రకీలాద్రిపై ఇంటి దొంగలు ఎక్కువైపోయారు. ప్రతి డిపార్ట్ మెంట్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు దోచుకోవడం తీరా దొరికాక వేరే డిపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అవ్వటం అలవాటు చేసుకున్నట్టున్నారు. పొరపాటున ఎవరిపై అయిన గట్టిగా యాక్షన్ తీసుకున్న ఎవరికి వారు రికమండేషన్స్ మీద మళ్ళీ రానే వస్తున్నారు. దాంతో అలయంలో ఉన్న అధికారులు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారు అమ్మవారి సొమ్మును దొంగిలించే పనిలోనే వున్నారు తప్ప సరైన ఆలయ లెక్కలు కూడా అందించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Minister KTR : బీజేపీ దేశాన్ని రావణకాష్టంలా మార్చింది