అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దుబాయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 38 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 21.3 ఓవర్లలో 104/1 స్కోరు చేయగా.. వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది.
Read Also: కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
భారత ఆటగాళ్లలో రఘువంశీ 56 పరుగులతో రాణించాడు. 8 పరుగుల వద్ద ఓపెనర్ హర్నూర్ సింగ్(5) వెనుతిరిగినా… షేక్ రషీద్‌తో కలిసి రఘువంశీ రెండో వికెట్‌కు 96 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. దీంతో భారత్ ఘనవిజయం సాధించింది. కాగా ఇప్పటి వరకు 9 సార్లు అండర్-19 ఆసియా కప్‌ను నిర్వహించగా… 8 సార్లు భారత్ విజేతగా నిలవడం విశేషం. 2017లో మాత్రం పాకిస్థాన్‌ను ఓడించి ఆప్ఘనిస్తాన్ ఈ టైటిల్‌ను అందుకుంది.