అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. శనివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేశారు. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన యువ భారత్.. గ్రూప్-బిలో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో విశ్వరూపం చూపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… ఉగాండాపై 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు చేసింది.
Read Also: టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు
మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాజ్ బవా 108 బంతుల్లో 162 పరుగులు, ఓపెనర్ అంగ్ కృష్ రఘువంశీ 120 బంతుల్లో 144 పరుగులతో ఉంగాండా బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్థి బౌలర్లను ఏ మాత్రం కనికరం చూపించకుండా వీళ్లు చెలరేగి ఆడారు. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. దీంతో 326 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది.