ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అలా మొదలయ్యాయో లేదో.. గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.
Read Also: యువ సంచలనం యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించిన ఐసీసీ
తమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకుండా కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. కాగా ప్రపంచకప్ టిక్కెట్లను ఫైనల్‌తో సహా మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను అధికారులు విక్రయానికి ఉంచారు. పిల్లలకు 5 డాలర్లు (రూ. 373), పెద్దలకు 20 డాలర్లు (రూ.1,493) నిర్ణయించారు. అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలు వేదికలుగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి.