దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,700గా ఉంది.
ప్రస్తుతం రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,09,473 చేరింది. ఇందులో 4,27,07,900 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 76,700 యాక్టివ్ కేసులుండగా.. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5,24,873 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 196,18,66,707 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. భారత్‌లో ఆదివారం 2,80,136 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,18,66,707 కోట్లకు చేరింది. మరో 2,96,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.