హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నమే రూమ్ ఖాళీ చేసి వెళ్లాల్సి ఉండగా.. మరోరోజు ఉంటామని చెప్పినట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారు.మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, సంతోషి గా గుర్తించారు. రూమ్ బాయ్ వెళ్లినప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నట్టు సమాచారం. కోపంతో సంతోషి గొంతుకోసి బాత్‌రూమ్‌లో పడేసిన రాములు… తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పంచనామా నిర్వహించారు.