టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూడటంతో గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు కమిటయ్యింది. కానీ వా వాతియార్, లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ, జీని సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ.. రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వా వాతియార్, లిక్ పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి దిగుతున్నాయని సంబరపడేలోపు మళ్లీ సమస్యలను ఎదుర్కొంటోంది డెబ్యూ ఫిల్మ్.
Also Read : The Rajasaab : రెబల్ స్టార్ ‘రాజాసాబ్’ రిలీజ్ వాయిదా.. ఎక్స్ ఖాతలో నిర్మాత సంచలన పోస్ట్
రెండేళ్ల క్రితం కార్తీ మూవీ వా వాతియార్‌కు కమిటైంది బేబమ్మ. ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుంది అనుకుంటే రెండేళ్లుగా వా వాతియార్ వాయిదా పడుతూనే ఉంది. మొత్తానికి డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటే మళ్లీ 12కి పోస్ట్ పోనైంది. ఇప్పుడు ఆ రోజు కూడా వస్తుందో రాదోనని డౌట్ పడుతున్నారు కోలీవుడ్ ఆడియన్స్. సుందర్ దాస్ అనే వ్యక్తి తనకు రావాల్సిన రూ. 21 కోట్ల 78 లక్షలు చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కాడు. ఈ సమస్య తీరితే కానీ ఈ సినిమాకు రూట్ క్లియర్ అవుతుంది, లేదంటే సినిమా రావడం కష్టమే. ఇక ప్రదీప్ రంగనాథన్‌తో తెరకెక్కుతోన్న లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ కూడా రెండేళ్లుగా షూటింగ్ చేసి మొన్నీమధ్యే కంప్లీట్ చేసుకుంది. అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ 18న రిలీజ్ అని ప్రకటించారు. రిలీజ్‌కు రెండు వారాలు కూడా లేవ్ కానీ ఎక్కడా ప్రమోషన్ల హడావుడి చేయడం లేదు. విఘ్నేశ్ శివన్ భార్యా పిల్లలతో కనిపిస్తున్నాడు కానీ ఈ సినిమా ఊసే ఎత్తడం లేదు. దీంతో సినిమా రిలీజ్ ఉందా లేదా అనే డౌట్ కకలుగుతోంది. ఇక మరొక సినిమా జీని నుండి జస్ట్ సాంగ్ తప్ప మరో అప్డేట్ లేదు. ఈ ఏడాది అయిపోయేలోపు కృతి తమిళ తంబీలను పలకరిస్తుందా లేదా చూడాలి .
