రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు… దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి తడపందే రెవెన్యూ అధికారులను చెట్లను లెక్కించడం లేదన్నారు. అనుమతించేందుకు అటవీశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.
Read Also: తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఢీఎఫ్‌ఓ వరకు చేయి తడపందే ఫైలు మందుకు కదలడం లేదని ఆయన విమర్శించారు. దీనిపై ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులు దృష్టి సారించి సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరారు. వీలైనంత తక్కువ సమయంలో అనుమతిచ్చి రైతులకు చెట్లను అమ్ముకునేందుకు తోడ్పాటును అందించాలని అయ్యన్న పాత్రుడు కోరారు.