ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదం మాత్రమే అన్నారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2023 లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడం. మహాత్మా గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే. నెహ్రూను తక్కువచేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్ ను తెరపైకి తీసుకు వస్తుందన్నారు ఉత్తమ్. ఒక్క సంతకంతో దేశం మొత్తం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్ర లేదు.. అందుకే మరొకరి చరిత్రను తనదిగా చెప్పుకుంటున్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటుంది. రాజకీయ, న్యాయ వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.