తెలంగాణ సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకుండా తప్పుచేశారని… ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆరోపించారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వాదులు బాధపడే సంఘటన అని అభివర్ణించారు.
Read Also: 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్
గవర్నర్ కుర్చీని సీఎం కేసీఆర్ అవమానించారని ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగడం రాష్ట్ర ప్రజలకు క్షేమకరం కాదన్నారు. అటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈరోజు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదని… ప్రగతి భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడిన మాటలు రాజ్యాంగం మీద విషం కక్కడమే అని ఆరోపించారు. పోచారం మాటలను గమనిస్తే కావాలనే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లలేదని స్పష్టం అవుతుందన్నారు. అటు సీఎం కేసీఆర్ తన మాటలతో ప్రజలను ఒప్పించే సత్తా కోల్పోయాడు కాబట్టే బీజేపీ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘటనను ఉద్దేశిస్తూ ఈటల విమర్శలు చేశారు.