కరోనాతో ఆగిపోయిన రైళ్లలో జనరల్ టిక్కెట్లను తిరిగి దశల వారీగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే చాలా రైళ్లలో కరోనా కారణంగా జనరల్ టిక్కెట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా రైళ్లు తిరిగి ప్రారంభం అయినా కేవలం రిజర్వేషన్ టిక్కెట్ సౌకర్యం మాత్రమే రైల్వే శాఖ కల్పించింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు సొంత వాహనాలు, లేదా బస్సులను ఆశ్రయించారు. అయితే తాజాగా కొన్ని రైళ్లలో జనరల్ టిక్కెట్లు ఇవ్వడానికి రైల్వే శాఖ ఓకే చెప్పింది.
Read Also: అనీమియా ముక్త్ భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోంది: NVSS ప్రభాకర్
దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అన్ని స్టేషన్లలోని జనరల్ కౌంటర్స్‌లో ఈనెల 21 నుంచి టిక్కెట్లను విక్రయించనుంది. రాయగడ- గుంటూర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు జనరల్ టిక్కెట్లు ఇవ్వనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని డైలీ ఎక్స్‌ప్రెస్‌లలో జనరల్ టిక్కెట్లను రైల్వే శాఖ ఇస్తుంది. గూంటూరు -సికింద్రాబాద్ గొల్కొండ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్, శాతవాహన సూపర్‌ఫాస్ట్‌ఎక్స్‌ప్రెస్, గూంటూరు- సికింద్రాబాద్ ఇంటర్‌సీటీ సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఇప్పటికే రైల్వే శాఖ జనరల్ టిక్కెట్లను ఇస్తుంది.