కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి శనివారం వైద్యులు ప్రసవం చేశారు. హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన అపర్ణ అనే గర్భిణికి పురిటినొప్పులు రాగా శనివారం తెల్లవారు జామున ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
Read Also:కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు 700 కోట్లు లాభాలు వచ్చాయి: సీహెచ్ నరసింగరావు
పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని గైనకాలజిస్టు డాక్టర్ వాణిలత సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఎంవో సుధాకర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో అపర్ణకు నార్మల్ డెలివరీ అయ్యేలా చేశారు. అపర్ణకు పాప జన్మించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. కరోనా జాగ్రత్తలు పాటించాలని, ఎవ్వరూ భయపడొద్దని సూచించారు. నార్మల్ డెలివరీ చేసిన వైద్యులను అపర్ణ బంధువులు అభినందించారు.