కేంద్ర ప్రవేశపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్ ’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్,తెలంగాణ, యూపీ,హర్యానా, తమిళనాడు, గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళనలు చేశారు. బీహార్, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీహార్ లో రైల్వే ఆస్తులే లక్ష్యంగా పలు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. స్టేషన్లను ధ్వసం చేశారు. తెలంగాణ సికింద్రాబాద్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనల్లో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
ఇదిలా ఉంటే కేంద్ర అగ్నిపథ్ పథకాన్ని సమీక్షిస్తోంది. ఈ పథకం కింద చేరిన అగ్నివీరులకు ఇప్పటికే రెండేళ్లు, తర్వాతి రోజు 5 ఏళ్లు మొత్తంగా 7 ఏళ్ల వయోపరిమితిని సడలించారు. దీంతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్సుల్లో ( సీఏపీఎఫ్) కింద ఉన్న అస్సాం రైఫిల్స్, సరిహద్దు భద్రతా దళాలు (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ)లో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మూడేళ్లు వయోపరిమితిని అగ్నివీరుల కోసం సడలించారు. ఇదే విధంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని కోస్ట్ గార్డ్ తో పాటు 16 సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు అగ్నివీరులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ ఆందోళనలు జరుగుతున్న వేళ మరోసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. శనివారం కూడా రాజ్‌నాథ్ సింగ్ వారితో చర్చించారు. తాజాగా ఈ రోజు కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Delhi | Defence Minister Rajnath Singh meets the three Services chiefs today amid 'Agnipath' protests pic.twitter.com/T14TRP7AAp
— ANI (@ANI) June 19, 2022