ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన ప్రసంగం మంటలు రాజేస్తోంది. మోడీ గోబెల్స్ లాగా..అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. పార్లమెంట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ఇవ్వలేదా..!? ప్రధాని మోడీ వ్యాఖ్యలు వెంకయ్య నాయడిని అవమానించడమే అన్నారు. ఆ రోజు పార్లమెంట్ లో ఉంది సుష్మా స్వరాజ్.. వెంకయ్య నాయుడు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వలేదా..?
Read Also రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఇప్పుడు ఎందుకు మోడీ ఇలా మాట్లాడటం అని ఆయన మండిపడ్డారు. సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కు వచ్చిన గుర్తులు కూడా ఆరక ముందే మోడీ తెలంగాణ పై మాట్లాడటం ఏంటి..? తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ , టీఆర్ ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.