ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే.. నిన్న 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ మాత్రం 13 వేలకు పడిపోయాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,08, 955 కి పెరిగింది.
Read Also: క్యాసినో విషయంలో దొంగ పోలీసులు ఒక్కటయ్యారు: సీఎం రమేష్
ఒక్క రోజు వ్యవధిలో మరో 12 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 561 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 101396 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 5716 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 92 , 955 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 46, 929 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,22,34,226 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.