Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • K Vishwanath Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home National News Condolences To Late Legend Lata Mangeshkar

లతా మంగేష్కర్ అస్తమయం.. ఎవరెవరు ఏమన్నారంటే?

Published Date :February 6, 2022 , 12:31 pm
By GSN Raju
లతా మంగేష్కర్ అస్తమయం.. ఎవరెవరు ఏమన్నారంటే?

ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఇక లేరన్న విషయాన్ని అభిమానులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆమె గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లత ఉదయం మరణించారు. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, చిరంజీవి, నిర్మలా సీతారామన్, గౌతమ్ గంభీర్, మంచు విష్ణు, రేవంత్ రెడ్డి, సీఎం జగన్, సీఎం కేసీఆర్, సాయి థరమ్ తేజ్, బాలయ్య నివాళులర్పించారు.

‘‘లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హృదయాలను కలిచివేసింది. ఆమె పాటల్లో భారతదేశ గొప్పతనం, తత్వం వ్యక్తమయ్యేది. భారతరత్న లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివి. ఇలాంటి కళాకారులు శతాబ్దంలో ఒక్కరు జన్మిస్తారు. లతా దీదీ అసాధారణమైన మనిషి. నేను ఆమెను కలిసినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓ దివ్య స్వరం శాశ్వతంగా నిశ్శబ్దంలోకి వెళ్లినా.. ఆమె శ్రావ్యమైన స్వరాలు మాత్రం నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆమె కుటుంబ సభ్యులకు, ప్రపంచ నలుమూలలా ఉన్న ఆమె అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ – రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

‘‘లతా దీదీ మనల్ని విడిచి వెళ్లారు. నాలో బయటకు చెప్పలేని ఆవేదన. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె స్వరంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. రాబోయే తరాలు ఆమెను భారత సంస్కృతికి ప్రతినిధిగా స్మరించుకుంటారు. ఆమె పాటలు అనేక రకాల వ్యక్తీకరణలను వెలుగులోకి తెచ్చాయి. దశాబ్దాలుగా భారత చలనచిత్ర రంగంలో వచ్చిన మార్పులకు ఆమె సాక్షిగా నిలిచారు. ఆమె ఎప్పుడూ భారతదేశ వృద్ధిని కాంక్షించేవారు. అభివృద్ధి చెందిన బలమైన భారతదేశాన్ని చూడాలని ఆమె ఆకాంక్షించారు. లతా దీదీ నుంచి నేను ఎప్పుడూ ఆప్యాయమైన పలకరింపును పొందానని చెప్పడానికి గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో జరిపిన సంభాషణలు మరువలేనివి. ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి నా సానుభూతి వ్యక్తం చేశాను. ఓం శాంతి’’ – నరేంద్ర మోదీ, ప్రధాని

‘‘మంత్రముగ్ధుల్ని చేసే తన స్వరంతో లతా దీదీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీత మాధుర్యాన్ని నింపారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఆమె మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. లతా దీదీ ఆప్యాయత, ఆశీర్వాదాలను పొందిన నేను అదృష్టవంతుడిని. సాటిలేని దేశభక్తితో, మధురమైన మాటలతో, సౌమ్యతతో ఆమె ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆమె కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ – అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి.

‘‘లతా మంగేష్కర్ మరణించారన్న దుర్వార్త నన్ను కలచివేసింది. దశాబ్దాలుగా భారతదేశానికి ఆమె స్వరం అత్యంత ప్రియమైనది. అజరామరమైన ఆమె బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ – రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

‘‘లతా మంగేష్కర్ మరణం భారత దేశ సినీ సంగీత లోకానికి తీరని లోటు. 30 వేలకు పైగా హిందీ ఇతర భాషలలో పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’’-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధినేత

ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ మరణం మన భారత ప్రజలందరినీ తీవ్రంగా కలచి వేసింది. ఆమె మృతి దేశానికి తీరనిలోటు-జానారెడ్డి. కాంగ్రెస్ నేత

‘‘ఎనిమిది దశాబ్దాల పాటు తన పాట తో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ఆగిపోయింది’’-కేసీఆర్, తెలంగాణ సీఎం

Nightingale of India, one of the greatest Legends #Lata Didi is no more.Heartbroken💔 The vacuum due to this colossal loss can never be filled. She lived an extraordinary life.Her Music lives on & will continue to cast a spell until Music is there! Rest in Peace #LataMangeshkar

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022

లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనం. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే…అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయి. లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి-నందమూరి బాలకృష్ణ

ntv google news
  • Tags
  • Amit Shah
  • Balakrishna
  • Chiranjeevi
  • Gautam Gambhir
  • Lata Mangeshkar

WEB STORIES

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

పెళ్లి చేసుకొని మెగా ఇంటికి  దూరం కానున్న వరుణ్ తేజ్..?

"పెళ్లి చేసుకొని మెగా ఇంటికి దూరం కానున్న వరుణ్ తేజ్..?"

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

RELATED ARTICLES

Telugu Director K Viswanath is no More Live: విశ్వనాథ్ మృతికి ప్రముఖుల నివాళి

CM JaganMohanReddy: తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Chiranjeevi : కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి

Amit Shah tour in Telangana: మరోసారి మోడీ టూర్​​ క్యాన్సిల్​.. 11న అమిత్‌ షా పర్యటన

తాజావార్తలు

  • Free Flight Tickets: విమాన టిక్కెట్లు ఫ్రీగా ఇస్తాం.. మా దేశం వచ్చిపోండి

  • KotamReddy Sridhar Reddy: నమ్మకద్రోహం మాటకు బాధేసింది

  • K Vishwanath: కళాతపస్వికి కన్నీటి నీరాజనం.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

  • Workers Strike : అట్టుడుకుతున్న బ్రిటన్.. వేతనాల కోసం రోడ్డెక్కిన లక్షలాది మంది

  • Marriage Cancel : కాసేపట్లో పెళ్లి.. కట్ చేస్తే సీనులోకి పోలీసులు.. ఈ పెళ్లి ఆపండి

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions