ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు ఋత్వికులు ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. యాగశాలలో సంస్కరించిన 33 దేవతామూర్తులతో శోభాయాత్ర నిర్వహిస్తారు.అంతకుముందు ముచ్చింతల్‌కు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.