మోడీ కామెంట్లతో తెలుగు రాష్ట్రాలు హీటెక్కాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్ళు పూర్తవుతున్నా మోడీ విభజనపై మంటలు రాజేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. దీనిపై కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. గాంధీ భవన్ ముందు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పై మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క.
ఇదిలా వుంటే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారం లో ఉంటే..ఇప్పటికీ తెలంగాణ వచ్చేది కాదన్నారు. పార్లమెంట్ లో ఏం జరిగింది అనేది..మోడీకి ఏం తెలుసు? తెలంగాణ బిల్లు ఆమోదం టైం లో ఉన్న సుష్మాస్వరాజ్ కి తెలుస్తుంది. బీజేపీ కి తెలంగాణ మీద అక్కసు ఎక్కువగా వుందన్నారు.
తెలంగాణ బిల్లు సమయంలో పార్లమెంట్ లో మోడీ లేడు, కేసీఆర్ లేడన్నారు. తెలంగాణ మీద చిత్త శుద్ది ఉంటే… ఏడు మండలాలు ఎందుకు ఏపీ కి ఇచ్చావు మోడీ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ ఇన్నాళ్లు మిత్రులుగా ఉండి విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదు? 1200 మంది చనిపోయారు అంటున్న టీఆర్‌ఎస్ అమరవీరులను ఆదుకునేందుకు మాత్రం 600 మందినే ఎంపిక చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి చావులకు టీఆర్‌ఎస్ పార్టీయే కారణం అన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ కి అహంకారం ఉంటే దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయంగా ఉండే వారే కాదన్నారు.